Monday, February 4, 2008

మేఘాలు కరిగి నీటి బింధువుల్లా మారి తమ నెలవయిన ఆకాశాన్ని వీడి తమకై ఎన్నో యుగాల వంటి రోజుల నుండి వేచిచూసే ఆ నేలను తాకగా... ఆ నీటి బింధువు తో పులకించిన నేల తల్లి ఆనందం తో వెదజల్లే సువాసన ఆ 'మట్టి వాసన".
ఆ నింగీ నెలా సంగమమే ఈ వాన. ఏనాడైనా ఆ సంగమాన్ని చూసారా?? ఏ రోజైనా ఆ సువాసన ని ఆస్వాధించారా?? ఆ వర్షాన్ని ఆ మట్టి వాసనని ఆనందించని వాళ్ళు ఉందరు కదూ!
ఆ చల్లని గాలి, ఆ గాలిలో ఆనందంగా తాండవం చెసే ఆ పచ్హని చేలు, ఎంతో దూరాన్నుంచి ఆ గాలి మోసుకొచ్హిన మట్టి వాసన నా మనసులో ఎదో తెలియని సంతొషాన్ని నింపాయి. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను వెలికి తెచ్హాయి.
వేసవికాలం సెలవులు, తాతగారి ఊరిలొ కలిసే బంధువులు, పచ్హని చేలు, ఆ తాటి కాయలు, ఈత పండ్లు, అమ్మమ్మ చేతి గోరు ముద్దలు...నాకంటే నాకు అని పోటి పడి మరీ తినటం, ఎడ్ల బండ్లు, ఊయ్యాలలు, గొర్రెల మందలు, తొక్కుడు బిల్ల, కొతి కొమ్మచ్హి, వీరి వీరి గుమ్మడి పండు, సాయంకాలం అరుగుపై ముచ్హట్లు, రాత్రి వేళ డాబా పై నిద్ర పోయేదాకా ఒకరిని ఒకరు ఆట పట్టించటం, పొడుపు కథలు విప్పటం, కథలతో కళ్ళ ముందు కదలాడిన రాజులు, మాంత్రికులు, రాక్షసులందరికి ఆ చంద్రుడు నక్షత్రాలే సాక్షి.
అనుకోకుండా ఓ మద్యహ్నం కురిసిన వర్షం, ఆనందం తొ తడిసి ముద్దయ్యేదాకా వేసిన చిందులు, మట్టితో చెసిన కళా ఖండాలు ఏనాటికీ మరువరానివి. ఆ ఆడిన ఆటలు, పాడిన పాటలు, అర్థంలేని పొట్లటలు, చెసిన అల్లర్లు ఎన్నటికి చెరిగిపోని తీపి గుర్తులు.

No comments: